జైనూర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ సిర్పూర్ యు మండలాలలోని గ్రామాల్లో గురువారం ముందస్తు దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కులదైవానికి పూజలు చేశారు. లింగాపూర్ మండలానికి చెందిన జాములదర గ్రామంలోని మోతిగూడ అవల్ పేన్ గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు . అక్కడే వంటలు చేసిన మినుములతో చేసిన గారెలు నైవేద్యంగా సమర్పించారు. మొక్కులు తీర్చుకోవడానికి మహిళలు బారులు తీరారు.
అనంతరం చిన్నపెద్దలు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ముందుగా గ్రామ శివారులో ఉన్న కుల దైవానికి మొక్కి, అనంతరం ఇంట్లో పండుగ జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని కుల పెద్దలు తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి ఏజెన్సీలోని ప్రతి గ్రామంలో ఇలా ముందస్తు దసరా పండగ జరుపుకుంటున్నారు.