భాగ్యలక్ష్మీ టెంపుల్ నిర్వహణపై ట్రిబ్యునల్‌‌‌‌ ఉత్తర్వులపై స్టే

భాగ్యలక్ష్మీ టెంపుల్ నిర్వహణపై ట్రిబ్యునల్‌‌‌‌ ఉత్తర్వులపై స్టే
  • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: చార్మినార్‌‌‌‌ వద్ద గల భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయశాఖకు అప్పగిస్తూ ఎండోమెంట్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌‌‌‌కు అప్పగిస్తూ ట్రిబ్యునల్‌‌‌‌ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. భాగ్యలక్ష్మీ ఆల యానికి సంబంధించి వారసత్వ వివాదం నడుస్తున్నది. 

ఆలయ ఆధిపత్యంపై రాజ్‌‌‌‌మోహన్‌‌‌‌ దాస్‌‌‌‌ వారసులు, రామచంద్రదాసు కుమార్తె ట్రిబ్యునల్‌‌‌‌ను ఆశ్రయించారు. ఈ వివాదంపై విచారించిన ట్రిబ్యునల్‌‌‌‌ ఆలయ నిర్వహణ బాధ్య తను దేవాదాయశాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్‌‌‌‌మోహన్‌‌‌‌ దాస్‌‌‌‌ వారసురాలు శశికళ మరికొందరు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌‌‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ ట్రైబ్యునల్‌‌‌‌ ఉత్తర్వులను నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.