కోల్బెల్ట్/చెన్నూర్, వెలుగు: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయమని ఐఎన్టీయూసీ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్ అన్నారు. శనివారం కాసిపేట-1 గనిపై ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మన్మోహన్సింగ్సంతాప సభ నిర్వహించి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సంస్కరణలతో బాగుచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్మరణం తీరని లోటన్నారు.యూనియన్ లీడర్లు రవీందర్, బన్న లక్ష్మణ్ దాస్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారని అన్నారు. నాయకులు అయిత హేమంత రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, మండల అధ్యక్షులు బాపగౌడ్, కోటపల్లి మండల అధ్యక్షుడు మహేశ్ తివారీ, చెన్నూరి శ్రీధర్, పాతర్ల నాగరాజు, చింతల శ్రీనివాస్, అన్వర్, మహేశ్, వంశీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.