భగత్ సింగ్​కు ఘన నివాళి 

కోల్ బెల్ట్, వెలుగు : రామకృష్ణాపూర్ పట్టణంలోని సీపీఐ ఆఫీసులో శనివారం షాహిద్ సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 93వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతా మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడటమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ టౌన్ సెక్రెటరీ మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, నక్క వెంకటస్వామి, వనం సత్యనారాయణ, కాదండీ సాంబయ్య, ఎగుడ మొండి, ఈరవెని రవి, మదాసు శంకర్, జంగపెల్లి సత్యనారయణ, శటగోపం కిష్టయ్య, గొవిందుల రమేశ్, బోయపోతుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.