
పెద్దపల్లి జిల్లాకు చెందిన శంకర్.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ సైకత శిల్పాన్ని రూపొందించి నివాళి అర్పించారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో గద్దర్ సైకత శిల్పాన్ని రూపొందించి, ఆయన ఉద్యమ జీవితాన్ని, పాటలను స్మరించుకున్నారు. ఈ శిల్పం రూపొందించేందుకు 5 గంటలు శ్రమించినట్లు ఆయన తెలిపారు. తన పాటల ద్వారా ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపిన మహనీయుడి రూపాన్ని చెక్కడంతో తన సైకత కళకు సార్ధకత చేకూరిందంటూ శంకర్ గద్దర్‌కు నివాళులర్పించారు.
‑ కరీంనగర్, వెలుగు