కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, వేజ్ బోర్డు శాశ్వత సభ్యుడుబి.జనక్ ప్రసాద్‌ను మినిమమ్ వేజ్అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా నియమించడంతో ఘనంగా సన్మానించారు. సింగరేణి కార్మికుల పక్షాన పోరాడున్న జనక్‌ప్రసాద్‌కు రాష్ట్ర సర్కార్ ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లలో గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. 1978లో క్లర్క్‌గా సింగరేణిలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచె లుగా ఎదిగారు.
ఈ సందర్భంగా జనక్ ప్రసాద్‌ను ఆదివారం జైపూర్ మండలం రసూల్ పల్లిలోని ఆయన నివాసంలో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల ఐఎన్టీయూసీ నేతలు ఘనంగా సన్మానించారు. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్లు శంకర్రావు, దేవి భూమయ్య, సెంట్రల్‌కమిటీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్లు నర్సింహారెడ్డి, సిద్దంశెట్టి రాజమౌళి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, జనరల్సెక్రటరీ కలవేని శ్యామ్, రాంశెట్టి నరేందర్, బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల ఏరియా, గనుల స్థాయి లీడర్లు పూల మాలలు, శాలువాలతో సన్మానించారు.