ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి సన్మానం

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్​ నాయకులు కాడే సూర్యనారాయణ ఆధ్వర్యంలో చెన్నూర్​ ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్​ సోమాజిగూడలో వివేక్​ స్వగృహంలో కాంగ్రెస్ నాయకులు, విశాఖ ఉపాధ్యాయులు ఆయనను కలిశారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో వివేక్​ వెంకటస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రుద్ర శంకర్​, కోడి లక్ష్మన్​, పొన్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.