- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాకా వర్ధంతి
పెద్దపల్లి/గోదావరిఖని/హుజూరాబాద్/ కోరుట్ల/కథలాపూర్/ సిరిసిల్ల టౌన్, వెలుగు : కార్మిక యోధుడు, దివంగత నేత గడ్డం వెంకటస్వామి(కాకా) వర్ధంతిని శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్శ్రేణులు, కాకా ఫౌండేషన్సభ్యులు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, హుజూరాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సుల్తానాబాద్, కథలాపూర్ధర్మారం, కోరుట్ల, పట్టణాల్లో కాకా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గోదావరిఖనిలో కాకా విగ్రహానికి, కరీంనగర్‌లో డీసీసీ ఆఫీస్‌లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పలువురు లీడర్లు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సింగరేణి అంటే కాకా.. కాకా అంటే సింగరేణి అనే విధంగా వారు కార్మిక రంగానికి ఎన్నో సేవలు చేశారన్నారు. అనేక పరిశ్రమలను తీసుకువచ్చి స్థానికులకు ఉపాధి కల్పించారన్నారు. కేంద్రమంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం సొసైటీలను ఏర్పాటు చేయించారన్నారు. కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో విశాక ఇండస్ట్రీస్, కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు (భిక్ష) అన్నదానం చేశారు.
కోరుట్లలోని జువ్వాడి భవన్‌లో కాకా ఫొటోకు కాంగ్రెస్ లీడర్జువ్వాడి కృష్ణారావు నివాళులర్పించారు. సిరిసిల్లలో మాలమహానాడు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ రైల్వే గేట్ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలి
కథలాపూర్ మండల కేంద్రంలో కేఎంఏవీ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు కాకా వెంకటస్వామి జిల్లాగా పేరుపెట్టాలని సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
రాజకీయ భీష్ముడు వెంకటస్వామి
గొల్లపల్లి వెలుగు: దివంగత నేత కాకా వెంటకస్వామి రాజకీయ భీష్ముడని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కొనియాడారు. ఎండపల్లి మండలం పార్టీ ఆఫీస్‌లో కాకా చిత్రపటం వద్ద నివాళులర్పించారు.