- ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్
కొల్లాపూర్, వెలుగు : రాష్ట్రంలోని చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని అమరగిరి చెంచుపెంటలో ఎంపీ మల్లు రవితో కలిసి పర్యటించారు. చెంచుల ఉపాధి కోసం నిర్మించిన చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించారు. కృష్ణా నదిలో చేపల వేటను ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని చెంచులు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ చెంచులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ పరంగా అవసరమైన సాయాన్ని అందిస్తామని, రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే రెండు ఆటోలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైద్యం అందించేందుకు సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమరగిరి గ్రామాన్ని రోల్ మాడల్ గా మార్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ చెంచులు చేపలు పట్టడాన్ని అడ్డుకోవద్దని, ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.