కామెడీలోనే కొత్త జానర్ ట్రై చేశా : అనిల్ రావిపూడి

ఫెస్టివల్ ఫిల్మ్‌‌‌‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నాడు. ఎఫ్‌‌‌‌2, ఎఫ్‌‌‌‌3 తర్వాత వెంకటేష్ హీరోగా అనిల్  రూపొందించిన మూడో చిత్రమిది. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. 

  •   ఈ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌కి సంబంధించింది. సంక్రాంతికి నాలుగు రోజులు ముందు జరిగే కథ. అందుకే  ఈ టైటిల్.  సంక్రాంతికి రావాలని ముందే ఫిక్స్ అయ్యాం. ఈ సినిమాతో వెంకటేష్ గారితో ఒక కొత్త జానర్ ట్రై చేశాను.  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు క్రైమ్ రెస్క్యూ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌లా ఉంటుంది.  భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్తగా వెంకటేష్ కనిపిస్తారు.  ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. 
  •  ఇందులో  భాగ్యం క్యారెక్టర్ చాలా స్పెషల్.  ఆ పాత్రలో ఐశ్వర్య రాజేష్  బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.  గోదారి యాస బాగా పలికింది. ఈ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొస్తుంది. మీనాక్షి చౌదరి ఎక్స్‌‌‌‌ గర్ల్ ఫ్రెండ్‌‌‌‌గా అందర్నీ  అలరించనుంది. తనకి మంచి టైమ్ సెన్స్ ఉంది. ఇద్దరూ అదరగొట్టారు. అలాగే  నరేష్ గారు, వీటీ గణేష్ గారి పాత్రలు హైలైట్‌‌‌‌గా ఉంటాయి. 
  •   మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌‌‌‌తో పని చేయాలని ‘పటాస్‌‌‌‌’ టైమ్‌‌‌‌ నుంచి అనుకుంటున్నా. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బీజీఎం కూడా వండర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంటుంది.‘గోదారి గట్టు’ సాంగ్  రమణ గోగుల గారితో పాడించిన క్రెడిట్ భీమ్స్‌‌‌‌కే దక్కుతుంది.  85 మిలియన్ వ్యూస్‌‌‌‌ని క్రాస్ చేసి  గ్లోబల్ సాంగ్ అయ్యింది. అలాగే  వెంకటేష్ గారు పాడిన  బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
  •   గొప్పగా సినిమా తీయడమే కాదు ప్రేక్షకుల అటెన్షన్‌‌‌‌ని  గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్‌‌‌‌ తెచ్చుకోగలం.  అందుకే ఈసారి సోషల్ మీడియాపై ఫోకస్ చేశాం.  ఎంగేజింగ్ కంటెంట్ ఉండబోతోందని ప్రేక్షకులకు నమ్మకం కుదిరింది.  థియేటర్స్‌‌‌‌కి వచ్చాక అది ఇంకా నచ్చితే సినిమా బ్లాక్ బస్టర్.  కొత్తగా నవ్వించడానికి ప్రయత్నించా..  ఆడియెన్స్ హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు. 
  •   ఎఫ్ 2, ఎఫ్ 3 కంటే ఈ చిత్రంతో వెంకటేష్ గారితో నా బాండింగ్ డబుల్ అయ్యింది. ఈ సినిమాతో బెస్ట్ బడ్డీస్ అయిపోయాం. అలాగే దిల్ రాజు, శిరీష్ గార్లను నా ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌లా భావిస్తాను.  అందుకే వారితో ఎక్కువ సినిమాలు చేశా. ‘ఎఫ్‌‌‌‌4 ’ కూడా ఉంటుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. 'సంక్రాంతికి వస్తున్నాం'ని కూడా ఫ్రాంచైజ్ చేసుకునే స్కోప్ ఉంది.