ఆడియన్స్ థియేటర్స్కు రావట్లే.. తమ సినిమా చూడమంటూ దర్శకుడు రిక్వెస్ట్

ఆడియన్స్ థియేటర్స్కు రావట్లే.. తమ సినిమా చూడమంటూ దర్శకుడు రిక్వెస్ట్

ఇంద్రా రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో త్రినాథరావు నక్కిన నిర్మించిన చిత్రం ‘చౌర్య  పాఠం’.వి. చూడమణి కో ప్రొడ్యూసర్. ఏప్రిల్ 25న  సినిమా విడుదల కానుంది. బుధవారం ఏప్రిల్ 16న ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘ఇదొక డార్క్‌‌‌‌‌‌‌‌ కామెడీ సినిమా. క్రైమ్ అంటూ లేని ఊరు అనే పాయింట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఒక టన్నెల్ తవ్వి దాని గుండా వెళ్లడం అనే కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ టెక్నికల్‌‌‌‌‌‌‌‌గా ఇంప్రెస్ చేసింది. దీనికి అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు నిఖిల్.

ఇక చౌర్య పాఠం అంటే దొంగతనం ఎలా చేయాలనే ట్రిక్కులు నేర్పడం కాదు.. అనుకోకుండా దొంగతనం చేయాల్సి వస్తే, ఆ ప్రయత్నంలో నేర్చుకునే గుణపాఠం. 14 సెట్స్‌‌‌‌‌‌‌‌ వేసి చాలా బాగా తీశాం.  విజువల్‌‌‌‌‌‌‌‌గా చాలా బాగా వచ్చింది.

కారణాలు ఏమైనా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ థియేటర్స్ రావడం తగ్గింది. ఇలాంటి సమయంలో అంతా కొత్తవారితో సినిమా చేయడం అనేది ఒక సాహసమే. అలాంటి సాహసం ఈ సినిమాతో చేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత అసలు కష్టాలు అర్థం అయ్యాయి. నిర్మాత మీద విపరీతమైన గౌరవం పెరిగిందని త్రినాథరావు చెప్పాడు.

మౌత్ టాక్ మీద నమ్మకంతోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా చూడండి.. మీరు థ్రిల్ ఫీల్ అవుతారని దర్శకుడు, నిర్మాత త్రినాథరావు రిక్వెస్ట్ చేశాడు.

తమ లాంటి కొత్త వారికి ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తూ త్రినాథరావు ఈ సినిమా చేయడం గొప్ప విషయం అని హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ థ్యాంక్స్ చెప్పారు.  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలోనే సినిమా కూడా అందరికీ నచ్చుతుందని దర్శకుడు చెప్పాడు.  నటుడు క్రిష్​, సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్ రీడా తదితరులు పాల్గొన్నారు.