సరదాగా ఏదైనా తినాలనిపిస్తే ఎవరైనా మార్కెట్ కి ఏం వేళ్దాం.. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఎంచక్కా ఇంటకే తెచ్చి ఇస్తారు కదా అని ఆర్డర్ చేస్తుంటాం. కానీ కొన్ని సార్లు మనం ఒకటి ఆర్డర్ చేస్తే.. ఇంకోటి వస్తుంటుంది.. లేదంటే డ్యామేజ్ అయిన ఐటమ్ డెలివరీ చేస్తుంటారు. కొందరు చేసేదేముందిలే.. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినా అది సాల్వ్ అయ్యే వరకు టైమ్ పడ్తుంది అని అడ్జస్ట్ అవుతారు లేదంటే వదిలేస్తారు. కానీ కొందరు ముక్కు పిండి మరీ వసూల్ చేస్తుంటారు.
తాజాగా తృణమూల్ పార్టీ (టీఎంసీ ) ఎంపీ మహువా మొయిత్రకి అలాంటి అనుభవమే అయ్యింది. స్విగ్గీలో ఐస్ క్రీమ్ ఆర్డర్ చెడిపోయి, తినడానికి వీలులేని ఐస్ క్రీమ్ వచ్చిందట. దీంతో ఆగ్రహించిన ఎంపీ.. ‘‘సారీ స్విగ్గీ.. ఒప్పుకునేదే లేదు.. మీ గేమ్ ఇక ఆపండి. నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. లేదంటే ఆర్డర్ రీప్లేస్ చేయండి’’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే ఆమె ఆర్డర్ చేసిన ఐటమ్ ను బట్టి చూస్తే 1220 గల 10 ఐటమ్స్ ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తుంది.
Sorry @Swiggy -you’ve got to up your game. Unacceptable that I ordered expensive Minus Thirty mini sticks ice cream & it arrives spoilt and inedible. Expecting a refund or replacement asap .
— Mahua Moitra (@MahuaMoitra) January 16, 2025
ఎంపీ ట్వీట్ కు స్విగ్గీ వెంటనే స్పందించి క్షమాపణ కోరింది. ‘‘హై మహువా.. సారీ.. మీ ఆర్డర్ నంబర్ పెట్టండి.. వెంటనే ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తాం’’ అని రిప్లై ఇచ్చింది.
Hi Mahua, sorry to know that you are facing an issue with your order. Please share the order number. We will look into it.
— Swiggy Cares (@SwiggyCares) January 16, 2025