కరీంనగర్, వెలుగు : జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఆదివారం ట్రినిటీ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రినిటీ సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు.
అనంతరంత ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.