- రిటర్నింగ్ ఆఫీస్ నుంచి 100 మీటర్ల లోపు ర్యాలీలు, ప్రచారం నిషేధం
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : నామినేషన్ వేసే టైంలో క్యాండిడేట్లు తప్పనిసరిగా ఎలక్షన్ రూల్స్ పాటించాలని, అన్ని డాక్యుమెంట్లతో నామినేషన్లు అందజేయాలని ములుగు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సూచించారు. నామినేషన్ల దాఖలు, స్క్రూట్నీ అంశాలపై రిటర్నింగ్ ఆఫీసర్, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్ వెంకన్నతో కలిసి గురువారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 3 నుంచి 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్లు తీసుకోనున్నట్లు చెప్పారు.
నామినేషన్ వేసే క్యాండిడేట్ ఎన్నికల వ్యయ నిర్వహణ కోసం ఏదైనా నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకోవాలని సూచించారు. నామినేషన్ వేసే టైంలో క్యాండిడేట్ ఇటీవల దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని రావాలని, పార్టీ కండువాలు, టోపీలు, నల్ల కళ్లద్దాలు వాడేందుకు వీలు లేదన్నారు. నామినేషన్ వేసే టైంలోనే ఎన్నికల వ్యయ ఏజెంట్ల వివరాలు అందజేయాలని, రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయ ఆవరణలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. క్యాండిడేట్‌తో పాటు మరో నలుగురికి మాత్రమే ఛాంబర్‌లోకి పర్మిషన్ ఉంటుందన్నారు. సమావేశంలో ములుగు తహసీల్దార్ విజయ్ భాస్కర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంధ్యారాణి, డీటీలు విజయ్‌కుమార్, అనిస్ ఫాతిమా పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బంది కేటాయింపు
జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ శివలింగయ్య చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో జనగామలోని ఏబీవీ డిగ్రీ కాలేజీ, పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని విద్యాజ్యోతి డిగ్రీ కాలేజీలో మాస్టర్ ట్రైనర్స్‌తో పీవో, ఏపీవోలకు ట్రైనింగ్ క్లాస్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ సుహాసిని, నోడల్ ఆఫీసర్లు ఇస్మాయిల్, కె. రాము, రాంప్రసాద్, పి. రవీందర్, దుర్గారావు ఉన్నారు. అనంతరం పెంబర్తి మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలోని కౌంటింగ్ కేంద్రాన్ని డీసీపీ పి. సీతారాం, రిటర్నింగ్ ఆఫీసర్లు రోహిత్‌సింగ్, మురళీకృష్ణ, రామ్మూర్తితో కలిసి పరిశీలించారు.
ALSO READ : కాంగ్రెస్సోళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్రు : పువ్వాడ అజయ్ కుమార్
ఎన్నికల ప్రచార ఖర్చు పక్కాగా రికార్డు చేయాలి
మహబూబాబాద్/మరిపెడ, వెలుగు : ఎన్నికల ప్రచార ఖర్చులను పక్కాగా రికార్డు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, ఇంటింటి ప్రచారాలు, బైక్ ర్యాలీల ఖర్చుల వివరాలను ఫీల్డ్ లెవల్, విజిలెన్స్ ఆఫీసర్లతో రికార్డు చేయించాలని సూచించారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్ నర్మద, వ్యయ పరిశీలన నోడల్ ఆఫీసర్ ఖుర్షీద్ పాల్గొన్నారు. అనంతరం మరిపెడ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్, తహసీల్దార్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌ను తనిఖీ చేశారు. ఎలక్షన్ డ్యూటీకి వచ్చే ఉన్నతాధికారుల కోసం గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్‌కు సూచించారు. ఆయన వెంట తొర్రూరు ఆర్‌వో నరసింహారావు, పశు సంవర్ధక శాఖ అధికారి సుధాకర్, ఆర్‌అండ్‌బీ ఈఈ తానేశ్వర్, తహసీల్దార్ సైదులు, మరిపెడ మున్సిపల్ కమిషనర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.