- ఎక్స్‌లెంట్ అవార్డుకు సింగరేణి
కోల్‌బెల్ట్, వెలుగు : నేషనల్ లెవల్ ట్రిపుల్ ఐఈ (ఇండియన్ ఇన్స్‌స్టిట్యూటీ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) సంస్థ ఇచ్చేపెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2024కు సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఎంపికయ్యారు. అలాగే కంపెనీల విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన కంపెనీగా సింగరేణి సంస్థ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెంట్ అవార్డును దక్కించుకుంది. ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో శుక్రవారం రాత్రి జరిగిన 24వ జాతీయ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సమావేశంలో అవార్డులను అందజేశారు.
సీఎండీ తరఫున సింగరేణి ఆపరేషన్స్ అండ్ పర్సనల్ డైరెక్టర్ ఎన్‌వీకే శ్రీనివాస్‌రావు అవార్డును అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవంలో సింగరేణి జనరల్ మేనేజర్ (ఎంఎస్) టి. సురేశ్‌బాబు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, డీజీఎం (ఐఈ) సీహెచ్. సీతారాంబాబు, ట్రిపుల్ ఐఈ గౌరవ కార్యదర్శి ఏవీవీ ప్రసాద్‌రాజు పాల్గొన్నారు. అవార్డు సాధించడం పట్ల సింగరేణి సీఎండి బలరాం నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఆఫీసర్ల సమష్టి కృషితోనే అవార్డులు దక్కాయని చెప్పారు.