ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యాదాద్రి జిల్లాలో 1,853.04 ఎకరాలు

  • రైతుల అభ్యంతరాలను తోసిపుచ్చిన ఆఫీసర్లు
  • త్వరలో త్రీ డీ నోటిఫికేషన్, అవార్డు ప్రకటన

యాదాద్రి, వెలుగు: ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రైతుల అభ్యంతరాలను ఆఫీసర్లు తోసిపుచ్చారు. దీంతో అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తేలిపోయింది. యాదాద్రి జిల్లా రైతులు వ్యతిరేకిస్తున్నా భూ సేకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణం కానుంది. ఇందుకోసం జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల్లో 1,853.04 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భూ సేకరణ కోసం ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు. అయితే రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డును యాదాద్రి జిల్లా రైతులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. రోజుల తరబడి ఆందోళనలు, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నాలు నిర్వహించడంతో పాటు సర్వేను కూడా అడ్డుకున్నారు. ఇప్పటికే పలుమార్లు భూములు కోల్పోయామని, మళ్లీ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతూ వచ్చారు. అయితే పోలీసుల సహకారంతో రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవలే సర్వేను పూర్తి చేశారు. ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రైతుల నుంచి అభ్యంతరాలను తీసుకునేందుకు డిసెంబర్, జనవరి నెలల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని, భూములు తీసుకుంటే తాము ఉపాధి కోల్పోవడంతో పాటు రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పెద్దల భూములను కాపాడేందుకు తమ భూములను తీసుకుంటున్నారని ఆరోపించారు.

రైతుల అభ్యంతరాలు తోసిపుచ్చిన ఆఫీసర్లు

బాధితులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే ఆఫీసర్లకు పంపించారు. భూ సేకరణ వల్ల కలిగే నష్టాలపై బాధితుల ఆవేదనను కూడా వివరించారు. గతంలో రూపొందించిన అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చాలంటూ బాధితుల అభిప్రాయాలను తెలిపారు. అయితే రైతుల అభ్యంతరాలను తోసిపుచ్చడంతో పాటు, అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని హైవే ఆఫీసర్లు స్పష్టం చేసినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.

అవార్డు ప్రకటన

నోటిఫికేషన్ల తర్వాత పరిహారానికి సంబంధించి అవార్డును ప్రకటించనున్నారు. త్రీ డీ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశాక, గత మూడేళ్లలో ఏడాది వారీగా భూముల ధరలు ఏఏ స్థాయిలో మార్పు చెందాయో పరిశీలించనున్నారు. తర్వాత పూర్తి వివరాలను నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే ఆఫీసర్లకు పంపంచాక, వారు అవార్డును ఖరారు చేయనున్నారు. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే ఆఫీసర్లు కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాక రైతులు, ఇతరులకు పరిహారం అందిస్తామని జిల్లా ఆఫీసర్లు చెప్పారు.

త్వరలో త్రీ ఏ, త్రీ డీ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూ సేకరణపై త్వరలో రెండు గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. భూ సేకరణపై ఇటీవల నిర్వహించిన సర్వేకు, తాము పబ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న భూసేకరణ వివరాలకు మధ్య ఏ మాత్రం తేడా ఉన్నా ఆయా సర్వే నంబర్ల వారీగా త్రీ ఏ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయనున్నారు. గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న విస్తీర్ణానికి, తాము నిర్వహించిన సర్వేలో తేలిన భూమికి తేడా లేకుంటే ఆయా సర్వే నంబర్లకు సంబంధించి పూర్తి వివరాలతో త్రీ డీ(డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేస్తారు.

అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారదని  హైవే ఆఫీసర్లు చెప్పారు 

ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పు లేదని నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే ఆఫీసర్లు చెప్పారు. రైతులు, ఇతరుల అభ్యంతరాలను తోసి పుచ్చారు. ఈ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారమే ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూ సేకరణ జరుగుతుంది.
–ఎంవీ భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్డీవో, భువనగిరి