ట్రిపుల్ ఆర్నార్త్ టెండర్ గడువు పెంచారు

ట్రిపుల్ ఆర్నార్త్ టెండర్ గడువు పెంచారు
  • ఈ నెల 23 వరకు పెంచిన ఎన్హెచ్ఏఐ
  • 5 ప్యాకేజీలుగా టెండర్ల ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్(ట్రిపుల్​ఆర్) నార్త్ పార్ట్ నిర్మాణానికి టెండర్ దాఖలు గడువును ఈ నెల 23 వరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) పొడిగించింది. వాస్తవానికి టెండర్ దాఖలు గడువు శుక్రవారంతోనే ముగియగా.. మరో 9 రోజులు పెంచింది. అదే రోజు టెండర్లను ఓపెన్ చేయనున్నారు. 161.518 కిలోమీటర్ల ఈ రోడ్డును రూ.7104.06 కోట్లతో నిర్మిస్తున్నారు.

ప్యాకేజీ.. పనుల వివరాలు

1వ ప్యాకేజీ: గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ. 1529.19 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్లు మొయింటెనెన్స్ చేయాలి.

2వ ప్యాకేజీ: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ.1114.80 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్ల మొయింటెనెన్స్ చేయాలి.

3వ ప్యాకేజీ: ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ.1184.81 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్లు నిర్వహించాలి.

4వ ప్యాకేజీ: ప్రజ్ఞపూర్ నుంచి రాయగిరి వరకు 43 కిలోమీటర్లు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1728.22 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్ల మొయింటెనెన్స్ చేయాలి.

5వ ప్యాకేజీ: రాయగిరి నుంచి తంగడ్ పల్లి వరకు 35 కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని రూ.1547.04 కోట్లతో రెండేండ్లలో నిర్మించాలి. ఐదేండ్లు నిర్వహించాలి.