బాధితుల ఆందోళన
యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ఆర్ అలైన్మెంట్మార్చాలని ట్రిపుల్ఆర్ బాధితులు డిమాండ్చేశారు. భారత్మాల పరియోజన ఫేస్–-1లో భాగంగా రీజినల్రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలో మీటర్లు నిర్మాణం కానుంది. జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్మండలాల్లో 1927 ఎకరాలను సేకరించాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా భూ సేకరణ చేస్తున్నారని యాదాద్రి కలెక్టరేట్ఎదుట బాధితులు సోమవారం ఆందోళన నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసి వేశారు.
దీంతో బాధితులు గేటు ఎదుటే ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలో మీటర్ల దూరంలో ట్రిపుల్ ఆర్ నిర్మించాల్సి ఉండగా, 30 కిలో మీటర్లలోపే ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. రైతులుగా తాము వ్యతిరేకిస్తున్నా ఆఫీసర్లు భూ సేకరణ కోసం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
పంటలు పండే పచ్చటి భూములను తీసుకొని తమకు ఉపాధి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్చేశారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావును కలిసి వినతపత్రం అందజేశారు.