
- ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక డిమాండ్
జూబ్లీహిల్స్, వెలుగు: ప్రాణం పోయినా ట్రిపుల్ఆర్కోసం భూములు ఇవ్వబోమని చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్‌కు రైతులు, బాధితులు తేల్చిచెప్పారు. ట్రిపుల్ఆర్భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సాగర్‌సొసైటీలోని నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ఆఫీస్వద్ద ఆందోళనకు దిగారు.
ఐక్య వేదిక కన్వీనర్ దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్‌విలువ ఎకరానికి రూ.5 కోట్లు ఉంటే.. ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు చెల్లించిందన్నారు. తమ భూములకు మార్కెట్‌ధర చెల్లించాలని డిమాండ్‌చేశారు. మూడేండ్ల నుంచి న్యాయం చేయాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భాగంలోని అలైన్‌మెంట్‌ను ఓఆర్ఆర్ నుంచి 28 కిలోమీటర్లకు బదులుగా 40 కిలో మీటర్లకు మారుస్తూ కొత్త డీపీఆర్ తయారు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు