Maharaja Trophy 2024: మహారాజా టోర్నీలో అద్భుతం.. ఒక మ్యాచ్‌‌‌‌లో మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లు

బెంగళూరు: టీ20ల్లో ఒక సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ ఆడటమే అరుదు. అలాంటిది ఒక మ్యాచ్‌‌‌‌లో ఏకంగా మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లు ఆడాల్సి వస్తే ఎలా ఉంటుంది.  కర్నాటకలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీ ఇలాంటి అరుదైన సంఘటనకు వేదికైంది. హుబ్లీ టైగర్స్‌‌‌‌‌‌‌‌, బెంగళూరు బ్లాస్టర్స్‌‌‌‌‌‌‌‌ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌ మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లకు దారి తీసింది. 

తొలుత హుబ్లీ నిర్ణీత 20 ఓవర్లలో 164 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. బెంగళూరు కూడా 20 ఓవర్లలో 164 రన్సే చేసింది.  దీంతో ఫలితాన్ని తేల్చేందుకు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించారు. తొలి సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌లో బెంగళూరు 10/1 స్కోరు చేయగా, హుబ్లీ కూడా 10/0 స్కోరే చేసింది. దీంతో రెండో సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. ఇందులోనూ బెంగళూరు 8/0, హుబ్లీ 8/1 స్కోరు చేశాయి. ఇక రిజల్ట్‌‌‌‌‌‌‌‌ కోసం మూడోసారి సూపర్‌‌‌‌‌‌‌‌  ఓవర్‌‌‌‌‌‌‌‌ ఆడించగా బెంగళూరు 12/1 స్కోరు చేస్తే, హుబ్లీ 13/1 స్కోరు చేసి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లు ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం.