
రంజీ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ముంబై, విదర్భ మధ్య సెమీ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ నువ్వా నేనా అని సాగుతున్న సమయంలో విదర్భ సీమర్ ఒక్క ఓవర్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. రెండో రోజు ఆటలో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 18) విదర్భ ఫాస్ట్ బౌలర్ పార్థ్ రేఖడే సంచలన బౌలింగ్ తో ముంబైను కష్టాల్లో నెట్టాడు. ఒకే ఓవర్లో స్టార్ ఆటగాళ్లు అజింక్య రహానేతో పాటు సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే లను ఔట్ చేసి ఔరా అనిపించాడు.
ఇన్నింగ్స్ 40 ఓవర్ తొలి బంతికి ముంబై కెప్టెన్ రహానేను బౌల్డ్ చేశాడు. మూడో బంతికి సూర్య కుమార్ యాదవ్ ను.. ఇదే ఊపులో ఐదో బంతికి శివమ్ దూబేలను డకౌట్ చేశాడు. దీంతో 2 వికెట్లకు 113 పరుగులతో పటిష్టంగా ఉన్న ముంబై ఒక్కసారిగా 113 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో ఈ యువ బౌలర్ ఆనందానికి అవధులు ;లేకుండా పోయాయి. గాల్లోకి ఎగురుతూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ తన అద్భుత బౌలింగ్ తో రేఖడే ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Also Read :- టాప్ 5 వన్డే బ్యాటర్స్ ఎవరో చెప్పిన సెహ్వాగ్
ప్రస్తుతం ముంబై రెండో రోజు చివరి సెషన్ లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజ్ లో శార్దూల్ ఠాకూర్(36), ఓపెనర్ ఆకాష్ ఆనంద్ (61) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ముంబై ఇంకా 207 పరుగులు వెనకబడి ఉంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో విదర్భ 383 పరుగులకు ఆలౌట్ అయింది. 308/5 స్కోరుతో రెండో రోజు ఆతనియూ ప్రారంభించిన విదర్భ మరో 75 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లను కోల్పోయింది. ధ్రువ్ షోరే 74 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Ajinkya Rahane 👆
— CricTracker (@Cricketracker) February 18, 2025
Suryakumar Yadav 👆
Shivam Dube 👆
Parth Rekhade is steaming fire in Ranji Trophy semi-final🔥
📸:JioHotstar pic.twitter.com/Rba6wnK1Rl