![Tripti Dimri: బోల్డ్ సీన్స్పై త్రిప్తి ఫ్యామిలీ రియాక్షన్.. సినిమా చూసి విజిల్స్ వేశారట](https://static.v6velugu.com/uploads/2024/03/tripti-family-reaction-on-bold-scenes_HKzUlAPO1r.jpg)
యానిమల్(Animal) సినిమాలో తన నటనతో హీరోయిన్ రష్మిక(Rashmika) కన్నా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది లేటెస్ట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri). ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. చేసింది చిన్న పాత్రే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక సినిమాలో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చాలా మంది కుర్రాళ్ళకి లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది ఈ బ్యూటీ.
ఇక ఈ సినిమా తరువాత క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. తెలుగులో కూడా ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్టులను త్రిప్తి ఓకే చేసినట్టు సమాచారం. అందులో ఒకటి రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా, మరొకటి రవితేజ సినిమా అని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిప్తి డిమ్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ సినిమా గురించి, ఆ సినిమాలో తన పాత్ర గురించి, ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ యానిమల్ సినిమాలోని బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడుతూ.. ఆ సీన్స్ పై మీ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి అని అడిగారు. దానికి సమాధానంగా త్రిప్తి స్పందిస్తూ.. సినిమాలో నేను చేసిన బోల్డ్ సీన్ రాగానే మా తల్లిదండ్రులు కేకలు వేశారు. నిజం చెప్పాలంటే.. ఆ సీన్స్ గురించి మా ఇంట్లో పెద్ద చర్చే జరిగింది. నాకు తెలుసు నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడుతున్నారని.. అంటూ చెప్పుకొచ్చారు త్రిప్తి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.260 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.900 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.