రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లలో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా అంటే VD12 అనే చెప్పాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి(Goutham thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన రెండు సినిమాలు ఆడియన్స్ను అలరించాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పాన్ ఇండియా సినిమా నుండి శ్రీలీల ఔట్ అయిందనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుండటం ఒక కారణమైతే..మరొకటి తన వరుస ఫెయిల్యూర్స్ మరొక కారణమని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన స్కంద, ఆది కేశవ, ఎక్స్‌ట్రా, గుంటూరు కారం సినిమాలు ప్రేక్షకులని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం మరో ఎత్తు. ధమాఖా హిట్ అవ్వగానే..ఒక రేంజ్ స్థాయిలో పాపులర్ అయిన శ్రీలీలకు తెలుగులో డజనుకు పైగా అవకాశాలు వచ్చాయి. కానీ, అరడజనుకి పైగా ఫెయిల్యూర్స్ వస్తుండటంతో..విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో మేకర్స్ నుంచి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మళ్ళీరావా (Mallirava) జెర్సీ(Jersey) వంటి సినిమాల్లో సెన్సిబుల్ ఎమోషన్స్ ను చాలా అద్భుతంగా క్యారీ చేసిన దర్శకుడి నుంచి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకునే అవకాశం ఉంది.
A morning full of smiles
— sreeleela (@sreeleela14) May 3, 2023
Started on such a positive note✨
Can’t wait to start shooting
With the super chill and sweet @TheDeverakonda and @gowtam19 garu✨@vamsi84 #SaiSoujanya @NavinNooli #GirishGangadharan @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios #VD12 pic.twitter.com/xXFYZuOhSg