Triptii Dimri: సామాన్య భక్తురాలిగా క్యూలో నిలబడి త్రిప్తి జ్యోతిర్లింగ దర్శనం.. ఫోటోలు వైరల్

Triptii Dimri: సామాన్య భక్తురాలిగా క్యూలో నిలబడి త్రిప్తి జ్యోతిర్లింగ దర్శనం.. ఫోటోలు వైరల్

బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Triptii Dimri) నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించి. లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు 'ఆత్మ కోసం ఒకటి' అని క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ప్రసిద్ధ జ్యోతిర్లింగ ఆలయంలో 'శివుని ఆశీస్సులు' పొందడానికి త్రిప్తి సామాన్య భక్తురాలిగా క్యూలో నిలబడింది. ఒక క్రేజీ సెలబ్రిటీ 'అందరితో పాటే తాను భక్తురాలినే' అనే విధంగా శివుని దర్శించుకోవడం చూస్తే.. చాలా ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఈ ఫొటోలో త్రిప్తి  ట్రిప్టీ మాస్క్ ధరించి, చేతుల్లో పూజ థాలీ పట్టుకుని కనిపిస్తుంది. ఆమె నారింజ రంగు కుర్తా మరియు పైజామాలో సాధారణంగా కనిపించి ఆకట్టుకుంది. అలాగే, నాసిక్ పర్యటనలో భాగంగా త్రిప్తి ప్రకృతితో ఎంజాయ్ చేస్తూ మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ | హైదరాబాద్‌లో సందడి చేసిన బాలీవుడ్​ హీరోయిన్

ఇకపోతే.. త్రిప్తి డిమ్రి విషయానికి వస్తే.. ఈ బ్యూటీ యానిమల్లో కనిపించింది చిన్న పాత్రలో అయిన..తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో,రొమాంటిక్ సీన్స్తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాంతో త్రిప్తికి పాలోయింగ్ విపరీతంగా పెరగడంలో నేషనల్ క్రష్ గానూ గుర్తింపు సొంతం చేసుకుంది. ఒక్కో ప్రాజెక్ట్ కోసం కోట్లాది రూపాయల పారితోషికాన్ని ఈ బ్యూటీ అందుకుంటోంది.

లైలా మజ్ను, బుల్బుల్, విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో వంటి రొమాంటిక్ చిత్రాలలో నటించి ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ధడక్ 2 లో సిద్ధాంత్ చతుర్వేది సరసన నటిస్తోంది.