![వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయాలి : గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/tripura-governor-indrasena-reddy-attended-a-private-function-held-in-nirmal_hLOiycWVaU.jpg)
నిర్మల్, వెలుగు: జ్ఞాన సంపదతోనే దేశం అభివృద్ధి చెందుతుందని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ లో జరిగిన ఓ ప్రైవేట్కార్యక్రమానికి ఇంద్రసేనారెడ్డి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయనకు నిర్మల్ లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ లోక్ సభ ఇన్ చార్జి అయ్యన్న గారి భూమయ్య తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047లో భారత్‌అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగి వికసిత్ భారత్ గా అవతరిస్తుందని అన్నారు.
విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగితేనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. దేశ అభివృద్ధిలో విద్యారంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రాథమిక విద్యను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలని ఇతరులతో పోల్చవద్దని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.