
బాసర, వెలుగు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి దేవి దర్శనానికి సోమవారం ఉదయం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రానున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతరం త్రివేణి సంగమం కందకుర్తికి వెళ్తారని చెప్పారు.