నారసింహుడి సేవలో త్రిపుర గవర్నర్

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సోమవారం ఫ్యామిలీతో కలిసి దర్శించుకున్నారు.  మొదట ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  అనంతరం గర్భగుడిలో  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తర్వాత ఆలయ అర్చకులు, వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అంతకుముందు యాదాద్రి బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులు గవర్నర్‌‌కు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.