గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ వదల్లేదు.. గత సర్కారు హయాంలో త్రిపుర గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాప్

గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ వదల్లేదు.. గత సర్కారు హయాంలో త్రిపుర గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాప్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదాలో ఉన్న వారిని కూడా ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ రావు గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ వదల్లేదని తాజాగా తేలింది. త్రిపుర ప్రస్తుత గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంద్ర సేనారెడ్డి ఫోన్‌‌‌‌‌‌‌‌ను ట్యాప్​ చేసినట్టు సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. త్రిపుర గవర్నర్​గా బీజేపీ అగ్రనేత నల్లు ఇంద్రసేనారెడ్డి 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 26న బాధ్యతలు స్వీకరించారు. 

కాగా, అప్పటికే రాజకీయ నాయకుల కదలికలపై నిఘా వేసిన ఎస్ఐబీ ఎస్‌‌‌‌‌‌‌‌ఓటీ బృందం..2023 నవంబర్ 15 నుంచి 30 వరకు ఆయన ఫోన్లను ట్యాప్ చేసింది. ఈ వివరాలను ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌, సీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ టీమ్ సేకరించింది. అయితే, ఇంద్రసేనారెడ్డి వినియోగిస్తున్న ఫోన్ నంబర్స్‌‌‌‌‌‌‌‌ ఆయన ఓఎస్డీ పేరుతో ఉన్నాయి. దీంతో ఓఎస్డీ నుంచి వివరాలు సేకరించారు. స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేశారు. గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌‌‌‌‌‌‌‌  ట్యాప్‌‌‌‌‌‌‌‌ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నది.

నేరస్తుల అప్పగింత ప్రక్రియ షురూ  

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, ఐ న్యూస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎండీ శ్రవణ్‌‌‌‌‌‌‌‌రావును ఇండియాకు రప్పించేందుకు సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం (ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాడిషన్) ద్వారా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌టర్నల్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ (ఎంఈఏ)కు ఇటీవల లెటర్ రాశారు. 

ఎంఈఏ నుంచి అమెరికా ప్రభుత్వానికి సమాచారం అందిం చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనం త తొందరగా ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసి, ఇద్దరు నిందితులను ఇండియాకు రప్పించేందుకు యత్నిస్తున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌‌‌‌‌‌‌‌రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుకు ఇప్పటికీ బెయిల్ లభించలేదు. భుజంగరావు మధ్యంతర బెయిల్‌‌‌‌‌‌‌‌పై ఉన్నారు.