తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: ఐదు రోజలు అన్ని సేవలు రద్దు .. ఎందుకంటే

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్:   ఐదు రోజలు అన్ని సేవలు రద్దు .. ఎందుకంటే

తిరుమల శ్రీ వేంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ఐదు రోజులు ఆర్జిత సేవలు బంద్‌ కానున్నాయి.. ఈ ఉత్సవాలు మార్చి 9 నుంచి 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మార్చి నెల 9 నుంచి 13 వరకు శ్రీవారి తెప్పోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది.

తిరుమల శ్రీ వెంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.. మొదటగా శ్రీ సీతా లక్ష్మణ ,ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా భక్తులకు శ్రీవారు కనువిందు చేయనున్నారు.  మరుసటి రోజు రుక్మిణి సమేత శ్రీ కృష్ణ భగవానుడిగా.. మూడవరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిగా శ్రీవారు పుష్కరిణిలో విహరించనున్నారు.   ఇక శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ALSO READ | AP MLC Election: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్