Vishwambhara: విశ్వంభర క్రేజీ అప్డేట్.. 18 ఏళ్ళ తరువాత చిరుకి జోడీగా త్రిష

Vishwambhara: విశ్వంభర క్రేజీ అప్డేట్.. 18 ఏళ్ళ తరువాత చిరుకి జోడీగా త్రిష

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

అయితే విశ్వంభర సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అలా అనుష్క, మృణాల్ ఠాకూర్, త్రిష మరియు హనీ రోజే పేర్లు వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫిక్స్ చేశామంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో కొంతకాలంగా విశ్వంభర హీరోయిన్ గురించి వస్తున్న న్యూస్ కు చెక్ పడింది. 

ఇక చిరంజీవి, త్రిష కాంబోలో ఇప్పటికే స్టాలిన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ 2006లో విడుదలై యావరేజ్ హిట్ గా నిలిచింది. దాదాపు 18 సంవత్సరాల తరువాత చిరుతో స్క్రీన్ చేసుకోనుంది త్రిష. మరి రెండోసారి జతకట్టనున్న ఈ జంట ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.