మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌లో..హీరోయిన్ త్రిష

మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌లో..హీరోయిన్ త్రిష

కెరీర్ స్టార్ట్ చేసి రెండు దశాబ్దాలు దాటుతున్నా హీరోయిన్‌‌‌‌గా వరుస సినిమాల్లో నటిస్తోంది త్రిష. ఇప్పటికే  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో  అరడజనుకుపైగా చిత్రాలు చేస్తూ, పలు వెబ్ సిరీస్‌‌‌‌లతో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో త్రిష ఆన్ బోర్డ్ అయ్యిందని శుక్రవారం అనౌన్స్ చేశారు. సూర్య సరసన ఆమె చాన్స్ అందుకుందని ప్రకటించారు. ఆర్జే బాలాజీ రూపొందించనున్న ఈ చిత్రంలోకి  వెల్‌‌‌‌కమ్ చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో త్రిష ప్రజెన్స్ ఇంప్రెస్ చేసింది.

ఇటీవలే పూజా కార్యక్రమాలతో షూటింగ్‌‌‌‌ను ప్రారంభించారు. సూర్య నటిస్తున్న 45వ సినిమా ఇది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్రకాష్‌‌‌‌బాబు, ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్రభు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే త్రిష నటిస్తున్న చిత్రాల్లో మలయాళ మూవీ ‘రామ్’,  కమల్‌‌‌‌తో చేస్తున్న తమిళ చిత్రం ‘థగ్ లైఫ్’ పూర్తవగా, గుడ్ బ్యాడ్ అగ్లీ, విశ్వంభరతో పాటు పలు సినిమాలు షూటింగ్‌‌‌‌ దశలో ఉన్నాయి.