క్రిస్మస్ పండుగ రోజు సినీ నటి త్రిష తన ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. క్రిస్మస్ రోజున, తెల్లవారుజామున తన కొడుకు చనిపోయాడని సినీ నటి త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదేంటి.. త్రిష కొడుకు చనిపోవడం ఏంటి..? ఆమెకు పెళ్లి ఎప్పుడు జరిగింది..? అని ఆశ్చర్యపోకండి. ఆమె కన్న కొడుకు కాదు. త్రిష ఒక కుక్కను కన్నబిడ్డలా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటుంది. దురదృష్టవశాత్తూ ఆ కుక్క ఇవాళ ఉదయం(డిసెంబర్ 25, 2024) చనిపోయింది.
దీంతో త్రిష ఈ క్రిస్మస్ తోజు ఉదయం తన పెంపుడు కుక్క జోర్రో చనిపోయింది. దీంతో నేను నా కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయాం. ఈ షాక్ నుంచి బయటపడటానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసింది.అలాగే జోర్రో ఫోటోలని కూడా షేర్ చేసింది. దీంతో త్రిష అభిమానులు జోర్రో ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ | పుష్ప రాజ్ బాటలోనే రామ్ చరణ్... ఇండియా వైడ్ గా అలా చేయబోతున్నాడా..?
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం త్రిష ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న సూర్య45 (వర్కింగ్ టైటిల్) సినిమాలో కూడా హీరోయిన్ నటిస్తోంది. ఇందులో అజిత్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
Zorro🪽
— Trish (@trishtrashers) December 25, 2024
2012-2024🌈 pic.twitter.com/9JHOB3RFNp
— Trish (@trishtrashers) December 25, 2024