Trisha: పిచ్చిపిచ్చి పోస్టులు పెట్టడమేనా మీ పని? ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన త్రిష

Trisha: పిచ్చిపిచ్చి పోస్టులు పెట్టడమేనా మీ పని? ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన త్రిష

హీరోయిన్ త్రిష చేసిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో త్రిష సొంతంగా డబ్బింగ్ చెప్పలేదని, కేవలం అందంగా ఉంటే సరిపోతుందా? సొంత భాషలో చెప్పకపోవడం ఏంటంటూ.. ట్రోలర్స్‌ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో విసుగుపోయిన త్రిష.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగేలా పోస్ట్ పెట్టారు. 

‘విషపూరితమైన వ్యక్తులు.. అసలు మీరెలా జీవిస్తున్నారు? మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఖాళీగా కూర్చొని సోషల్ మీడియాలో ఇతరులను ఉద్దేశించి పిచ్చిపిచ్చి పోస్టులు పెట్టడమేనా మీ పని? మిమ్మల్ని చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. మీతోపాటు జీవించే వారి విషయంలో బాధగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడు మీ అందరినీ నిజంగా దీవించుగాక!’అంటూ పోస్టు పెట్టింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. అయితే, గతంలో త్రిష ఇలాంటి పోస్టులకు చాలాసార్లు నెటిజన్స్ కి కౌంటర్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో చేసిన లేటెస్ట్ పోస్ట్, మరింత ఘాటుగా ఉండటంతో త్రిష మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా విషప్రయోగానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు త్రిషను.. ఆమె ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

ఈ మూవీలో అజిత్ సరసన త్రిష నటించింది. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రియా ప్రకాష్ వారియర్ మరియు షైన్ టామ్ చాకో కూడా కీలక పాత్రలు పోషించారు. యాక్షన్-ప్యాక్డ్గా వచ్చిన ఈ మూవీ తమిళనాడు అంతటా దూసుకెళ్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)