త్రిషకు మరో గోల్డెన్ ఛాన్స్..18 ఏళ్ల తర్వాత ప్రభాస్‌ సరసన!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రెజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో సలార్ పార్ట్ 2(Salaar 2), కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD), స్పిరిట్(Spirit) సినిమాలు ఉన్నాయి. అయితే.. ఈ మూడు సినిమాల్లో స్పిరిట్ కోసమే ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కారణం ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) దర్శకుడు అవడం. అయితే, ప్రభాస్, సందీప్ రెడ్డి లాంటి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్ పై చర్చ వేడెక్కింది. 

తాజా సమాచారం ప్రకారం..'స్పిరిట్'లో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక త్రిష ఈ కాంబోలో ఎంట్రీ ఇస్తే మాత్రం ఆడియన్స్ కి పండుగనే చెప్పుకోవాలి. గతంలో త్రిష ప్రభాస్‌తో కలిసి 'వర్షం', 'పౌర్ణమి' సినిమాల్లో నటించింది. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత త్రిష,ప్రభాస్‌ కలయికలో స్పిరిట్ రాబోతుందని వార్తలు వస్తుండటంతో..ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇదే విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం హీరోయిన్ త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు..సీనియర్ హీరోలతోను యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకి పైగా మూవీస్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరు సరసన విశ్వంభర, అజిత్ విదా మూయుర్చి, కమల్ హాసన్ థగ్ లైఫ్,మోహన్ లాల్ రామ్ వంటి మరిన్ని సినిమాల్లో నటిస్తుంది.

ఇకపోతే త్రిష తాజాగా  'బృందా' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.ఈ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ కు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి రెస్పాస్ వస్తోంది.