ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సరికొత్త స్పీడ్ T4తో తన లైనప్‌ను లాంచ్ చేసింది. దీంతోపాటు మోడిఫై చేయబడిన MY25 స్పీడ్ 400ని కూడా విడుదల చేసింది.ట్రయాంఫ్ స్పీడ్ T4 బైక్ 398cc ఇంజన్‌ను కలిగి ఉంది. రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ ట్యూన్‌తో వస్తుంది. స్పీడ్ 400 కొత్త హై-ప్రొఫైల్ వ్రేడెస్టెయిన్ టైర్లు , అడ్జస్ట్ చేయగల లివర్లు ఉంటాయి.
ట్రయాంఫ్ స్పీడ్ T4 మోటార్‌సైక్లింగ్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది. రైడర్‌ల కోసం రిలాక్స్ అందించే విధంగా ప్రత్యేకంగా తయారు చేయబడింది. దీని 398cc TR-సిరీస్ ఇంజన్ 7,000rpm వద్ద 31bhpని , 5,000rpm వద్ద 36Nmని విడుదల చేస్తుంది. తక్కువ-rpm స్థిరత్వం, కొత్త డీప్ ఎగ్జాస్ట్ నోట్ ఉంటుంది.
స్పీడ్ T4 తక్కువ గేర్ షిఫ్ట్‌లు, తక్కువ రివ్‌లతో 100kmph వేగంతో ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది. బైక్‌లో మాన్యువల్ థొరెటల్ బాడీ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, 43 mm టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్-ఛానల్ ABS , USB పోర్ట్ ఉన్నాయి. ట్రయాంఫ్ స్పీడ్ T4 ..మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. పెరల్ మెటాలిక్ వైట్, కాక్‌టెయిల్ వైన్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ వంటి రంగులతో రైడర్లను ఆకట్టుకుంటోంది.
ట్రయంఫ్ స్పీడ్ T4 , స్పీడ్ 400 ధర, ప్రత్యర్థులు
ట్రయంఫ్ స్పీడ్ T4 రూ. 2.17 లక్షలు (ఎక్స్-షోరూమ్), స్పీడ్ 400 రూ.2.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభించబడింది. రెండు బైక్‌లు రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా ధర రూ.2.54 లక్షలు , KTM 390 డ్యూక్ ధర రూ.3.13 లక్షలు కంటే చాలా తక్కువలో చీప్ గా లభిస్తున్నాయి.