Priyanka Jain: ఒకప్పుడు పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడిలా.. షాక్ అవుతన్న ఆడియన్స్..

Priyanka Jain: ఒకప్పుడు పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడిలా.. షాక్ అవుతన్న ఆడియన్స్..

ప్రియాంక జైన్.. తెలుగులో సీరియల్ హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది.. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ అయిన స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే మౌనరాగం అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అయితే కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయేసరికి హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.. 

అయితే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత ఒక్కసారిగా ప్రియాంక జైన్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకూ సీరియల్స్ తో బిజీగా గడిపిన ఈ బ్యూటీ ఈమధ్య షోలు, ఈవెంట్లు అంటూ గ్లామర్ లుక్ లో అలరిస్తోంది. అయితే ఇటీవలే ఓ డాన్స్ షోకు ప్రియాంక జైన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ప్రియాంక జైన్ ఒకప్పుడు చక్కటి కట్టు బొట్టుతో పద్దతిగల అమ్మాయి లుక్ లో కనిపించేది. కానీ ఉన్నట్లుండి ఇలా క్లివేజ్ షో చేస్తూ కనిపించేసరికి బుల్లితెర ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read:-మా అక్క తిట్టింది నిజమే.. మా వెర్షన్ కూడా వినండి

ఈ విషయం ఇలా ఉండగా నటి ప్రియాంక జైన్ ఈ మధ్య హీరోయిన్ ఆఫర్లకోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఫోటోషూట్లు చేస్తూ గ్లామర్ పాత్రలు చేసేందుకు కూడా రెడీ అంటూ దర్శక నిర్మాతలకి సిగ్నల్స్  పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రియాంక జైన్ కి సోషల్ మీడియాలో కూడా బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో పలు సంస్థల ప్రాడక్స్ట్ ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.