ముంబై: భారతీయ సినీ సంగీత ప్రపంచంలోని సంగీత శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడిన ఆ మధుర గళం.. అందరికీ వీడ్కోలు చెప్తూ ఫిబ్రవరి 6న ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కాగా, లతా జీ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
షారుక్ ఖాన్ తన మేనేజర్ పూజతో కలసి లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చాడు. ఆ సమయంలో లతా జీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. మాస్క్‌ను కిందకు దించి ఆమె పాదాల దగ్గర ఊదాడు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు లత పాదాల దగ్గర షారుక్ ఉమ్మేసినట్లు కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ప్రవర్తనను ఎండగడుతూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ.. షారుక్ ఉమ్మేయలేదని, భౌతిక కాయం దగ్గర ఊదడం అనేది ఒక ప్రార్థనా విధానమని ట్రోల్స్ ను తిప్పికొట్టారు.
దువా చదివేటప్పుడు గాలి ఎందుకు ఊదుతారు?
ఇస్లాం ప్రకారం ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఏదైనా సందర్భాల్లో దువా చదువుతారు. దువా చదివిన తర్వాత.. తాము ఎవరి కోసం దువా చదివారో వారు దగ్గరగా ఉంటే వారి ముందుకు వెళ్లి గాలి ఊదుతారు. ఇప్పుడు షారుక్ చేసింది కూడా ఇదేనంటూ చాలా మంది ట్వీట్లు పెడుతున్నారు.
Fringe targetting @iamsrk by falsely accusing him of spitting at #LataMangeshkar Ji’s funeral should be ashamed of themselves. He prayed & blew on her mortal remains for protection & blessings in her onward journey. Such communal filth has no place in a country like ours ???? pic.twitter.com/xLcaQPu1g8
— Ashoke Pandit (@ashokepandit) February 6, 2022
మరిన్ని వార్తల కోసం: