చిరిగిన జీన్స్, టీ షర్టులు వేసుకుని కాలేజీకి రావద్దు

చిరిగిన జీన్స్, టీ షర్టులు వేసుకుని కాలేజీకి రావద్దు
  • స్టూడెంట్లకు ముంబైలోని ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ నోటీస్

ముంబై: మహారాష్ట్రలోని చెంబూర్​లో ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్న ఎన్‌‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠా కాలేజీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు నిఖాబ్, హిజాబ్,  బుర్ఖా, క్యాప్ ధరించి కాలేజీకి రావడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన సొసైటీ..తాజాగా చిరిగిన జీన్స్, టీ షర్టులు, జెర్సీలపైనా నిషేధం విధించింది. తమ కాలేజీ క్యాంపస్​కు వచ్చే స్టూడెంట్లు సాంస్కృతిక అసమానతల్ని చూపే డ్రెస్సులతో  రావొద్దని స్పష్టం చేసింది.  

కాలేజీల్లోకి చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని, ఫార్మల్, డీసెంట్ దుస్తులతో పాటు హాఫ్ లేదా ఫుల్ షర్ట్, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. బాలికలు ఇండియన్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులు ధరించినా అభ్యంతరంలేదని ఈ నెల27న నోటీసు జారీ చేసింది. గత నెలలో ఇదే కాలేజీ హిజాబ్, బుర్ఖా, నిఖాబ్, టోపీలను నిషేధించింది. దానిపై పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం సబబేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.