హైదరాబాద్, వెలుగు: మిల్లెట్ ఆధారిత స్నాక్ బ్రాండ్ ట్రూ గుడ్ తాజా ఫండింగ్ రౌండ్‌లో 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.78 కోట్లు) సేకరించింది. పురో వెల్నెస్ నేతృత్వంలోని ఈ ఫండింగ్ రౌండ్‌లో ఇప్పటికే షేర్‌హోల్డర్లయిన ఓక్స్ అసెట్ మేనేజ్‌మెంట్, వీ ఓషన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పాల్గొన్నాయి.
ఈ ఫండ్స్‌ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడానికి, బిజినెస్‌ను విస్తరించడానికి, కొత్త ప్రొడక్ట్‌లను తీసుకురావడానికి వాడతారు. ట్రూ గుడ్ ఇప్పటివరకు సుమారు రూ.130 కోట్లను సేకరించింది.