స్మార్ట్ ఫోన్ మన నిత్య జీవితంలో ఓ భాగమై పోయింది. ఇది కమ్యూనికేషన్, పని, చెల్లింపులు, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అనేక విధాలుగా మనకు సహాయపడుతుంది స్మార్ట్ ఫోన్. దాదాపు 80 శాతం రోజూ వారి పనుల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తుంటాం. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల వినియోగంలో దాదాపు అందరూ ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్.. కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ నాయిస్.దీంతో మనం ముఖ్యమైన కాల్స్ మాట్లాడుతున్న కన్వర్ జేషన్ ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చింతించాల్సిన అవసరం లేదు. ఒక్క సెట్టింగ్ తో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ కు చెక్ పెట్టొచ్చు.
ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ల అవసరం లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో కొన్ని మార్పులు కాల్స్ నాణ్యతను పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ను ఎలా ఎనేబుల్ చేయాలి.. ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాక్ గ్రౌండ్ నాయిస్ కు చెక్ పెట్టేందుకు Android ఇన్ బుల్ట్ సెట్టింగ్
Android స్మార్ట్ ఫోన్లలో క్లియర్ కాల్ ఫీచర్ ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఫిల్టర్ చేస్తుంది. కాలింగ్ నాణ్యత పెంచుతుంది. వినికిడి నాణ్యతను మునుపటి కంటే మెరుగ్గా చేస్తుంది. గతంలో ఇటువంటి యాంటీ నాయిస్ ఫీచర్లు ఇయర్‌ఫోన్లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు చాలా స్మార్ట్‌ఫోన్లు ఈ సెట్టింగ్ ఇన్ బుల్ట్ గా వస్తున్నాయి. ఒకసారి ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేస్తే.. బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తొలగిస్తుంది. కాల్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో కూడా కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది..
క్లియర్ కాల్ ఫీచర్‌ని ఇలా ఎనేబుల్ చేయండి..
- Android ఫోన్ ను అన్ లాక్ చేసి, సెట్టింగ్ మెనూలోకి వెళ్లాలి.
- సౌండ్ సెట్టింగ్ ఓపెన్ చేసిన సౌండ్ అం డ్ వైబ్రేషన్ లపై క్లిక్ చేయాలి.
- క్లియర్ కాల్ ని ఎనేబుల్ చేయాలి. క్లియర్ వాయిస్ లేదా క్లియర్ కాల్స్ ఆప్షన్ కోసం సెర్చ్ చేసి టోగుల్ ఆన్ చేయాలి.
- కొన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ నేరుగా స్క్రీన్ పై కనిపిస్తుంది. యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో క్లియర్ కాల్ ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే నాయిస్ కు చెక్ పెట్టొచ్చు. ఇంపా ర్టెంట్ కాల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుకోవచ్చు.