ఇతని విన్యాసానికి పక్షి కూడా సరిపోదు..క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్

ఇతని విన్యాసానికి పక్షి కూడా సరిపోదు..క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్

క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి సూపర్ స్మాష్ టీ20 లీగ్ లో నమోదయింది.

వెల్లింగ్టన్, సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య బేసిన్ రిజర్వ్‌లో జరిగిన మ్యాచ్ లో ఒక అసాధారణమైన క్యాచ్ నమోదయింది. స్నిడం వేసిన ఆరో ఓవర్లో బ్యాటర్ యంగ్ లాంగిన్ దిశగా షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన ఈ క్యాచ్ ను అందుకునే క్రమంలో ట్రాయ్ జాన్సన్ వేగంగా రన్నింగ్ చేసుకుంటూ బౌండరీ వద్దకు వెళ్ళాడు. అద్భుతమైన క్యాచ్ ను సైతం అందుకున్నాడు. అయితే బౌండరీ రోప్ తగులుతాడని ముందుగానే గ్రహించి రెప్పపాటు కాలంలో బంతిని వెంటనే మరో ఫీల్డర్ కెల్లీకి విసరగా.. కెళ్ళీ క్యాచ్ ను అందుకున్నాడు. 

ఈ అసాధ్యమైన క్యాచ్ ను పట్టుకునే క్రమంలో కెల్లీ పట్టిన క్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచం క్రికెట్ లో ఇదొక బెస్ట్ క్యాచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్యాచ్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. జాక్ బాయిల్ 43 బంతుల్లో 10 బౌండరీలతో 57 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో బ్రేస్ వెల్ 11 బంతుల్లో 30 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.