సిద్దిపేట/దౌల్తాబాద్, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన స్వామికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో స్వామి చురుగ్గా పాల్గొన్నాడు. టీఆర్ఎస్ ఓడిపోవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి బుధవారం కొనాయిపల్లికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హరీశ్ రావు, ప్రభాకర్‌రెడ్డి స్వయంగా పాడె మోశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. స్వామి కుటుంబానికి రెండు లక్షల సహాయాన్ని అందించి అతని పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తామని హామీ ఇచ్చారు.
For More News..