రుణమాఫీపై మాట్లాడిన ఉత్తమ్..అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పీఏసీఎస్ నూతన గోడౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి ఒకే వేదికపై ఉన్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఉత్తమ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో ఉత్తమ్ మాట్లాడకుండానే వేదిక దిగి వెళ్లిపోయారు. రుణమాఫీ, పంట బీమాపై ఉత్తమ్ మాట్లాడుతుండగా గొడవ మొదలైంది.