రాజగోపాల్​రెడ్డిపై టీఆర్​ఎస్ ఆరోపణలకు ఆధారాల్లేవ్​

హైదరాబాద్, వెలుగు: సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి వివిధ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్​ఫర్​ అయినట్లు ఆరోపిస్తూ  టీఆర్ఎస్​ చేసిన కంప్లయింట్​ను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టివేసింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. ‘‘టీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది కానీ... అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని ఈసీ స్పష్టం చేసింది. దీంతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిపై టీఆర్ఎస్​ నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు రుజువైంది. ఓటర్ల ప్రలోభాల కోసం రాజగోపాల్​రెడ్డి సుశీ ఇన్​ఫ్రా నుంచి రూ. 5.24 కోట్లు  మునుగోడుకు చెందిన 23 వివిధ బ్యాంకు అకౌంట్లకు మళ్లించారని ఇటీవల ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కొన్ని అకౌంట్ల వివరాలను అందజేశారు. దీనిపై  ప్రైమరీ ఎంక్వైరీతో పాటు రాజగోపాల్​రెడ్డి నుంచి ఈసీ వివరణ తీసుకున్నది.

హైదరాబాద్, వెలుగు: సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి వివిధ అకౌంట్లకు డబ్బుల ట్రాన్స్​ఫర్​ అయినట్లు ఆరోపిస్తూ  టీఆర్ఎస్​ చేసిన కంప్లయింట్​ను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. ‘‘టీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది కానీ... అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని ఈసీ స్పష్టం చేసింది. దీంతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిపై టీఆర్ఎస్​ నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు రుజువైంది. ఓటర్ల ప్రలోభాల కోసం రాజగోపాల్​రెడ్డి సుశీ ఇన్​ఫ్రా నుంచి రూ. 5.24 కోట్లు  మునుగోడుకు చెందిన 23 వివిధ బ్యాంకు అకౌంట్లకు మళ్లించారని ఇటీవల ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని అకౌంట్ల వివరాలను అందజేశారు. దీనిపై  ప్రైమరీ ఎంక్వైరీతో పాటు రాజగోపాల్​రెడ్డి నుంచి ఈసీ వివరణ తీసుకున్నది. తన నుంచి కానీ.. తన చీఫ్​ ఎలక్షన్​ ఏజెంట్ల నుంచి కానీ ఎలాంటి లావాదేవీలు జరగలేదని రాజగోపాల్​రెడ్డి సోమవారం ఈసీకి వివరణ ఇచ్చారు. సుశీ ఇన్​ఫ్రాలో తాను డైరెక్టర్​గా  కానీ,  పార్ట్​నర్​గా కానీ లేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్​ ఇచ్చిన కంప్లయింట్​లోని అకౌంట్ల వివరాలు తప్పుడువన్నారు. ఆ బ్యాంకు అంకౌట్ల వివరాలు, వాటితోపాటు మునుగోడులో ఉన్న అబ్జర్వర్స్​తోనూ కేంద్ర ఎన్నికల సంఘం రిపోర్ట్​ తెప్పించుకొని.. టీఆర్​ఎస్​ఆరోపణల్లో వాస్తవం లేదని, బేస్​ లెస్​ అని  తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజు ఆదేశాలు జారీ చేసింది. మునుగోడు బై ఎలక్షన్​లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఉంచాలని తెలిపింది. నియోజకవర్గంలో వివిధ సంస్థల ద్వారా పూర్తి స్థాయి మానిటరింగ్​ కొనసాగించాలని  సూచించింది.