ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి జిల్లా: మానేరు వాగు ఇసుక టెండర్ల వివాదంపై పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వారి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మానేరు వాగు ఇసుక టెండర్లలో లక్షల రూపాయల ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత విజయ రమణారావు చేసిన ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. ముడుపులు తీసుకోలేదని ఓదెల మల్లన్న ఆలయంలో ప్రమాణం చేయాలంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, విజయ రమణారావు సవాల్ విసిరారు.

ఈనేపథ్యంలో  ఆదివారం ఓదెల మల్లన్న టెంపుల్ కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావును పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.  మరోవైపు తన ఇంటి నుంచి మల్లికార్జున స్వామి ఆలయానికి బయలుదేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.