నువ్వా నేనా..మునుగోడులో టీఆర్ఎస్ ఆశావహుల ఫ్లెక్సీలు

నల్గొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ ఆశావహుల ఫ్లెక్సీలు జోరుగా వెలిశాయి. మునుగోడులో రేపు కేసీఆర్ బహిరంగ సభ ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతలు కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కేసీఆర్ సభ వరకు వీటిని ఏర్పాటు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. కేసీఆర్ 

కాగా తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు ఉపఎన్నిక చుట్టే తిరుగుతోంది. శనివారం మునుగోడులో జరిగే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సభలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. అభ్యర్థి విషయంలో హైకమాండ్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డినే బైపోల్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌గా అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తారని సమాచారం. కూసుకుంట్ల పేరు ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన్ను వ్యతిరేకిస్తున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.

ఆదివారం అమిత్ షా సభ

అదేవిధంగా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ ఉంది. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ మీటింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. మునుగోడు ఉపఎన్నిక సహా పార్టీ బలోపేతంపై రాష్ట్ర నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.  రెండు రోజుల్లోనే రెండు పార్టీల మీటింగ్ లు ఉండడం ఆసక్తిగా మారింది.