టీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం పార్టీలు ఒక్కటే

కాంగ్రెస్ హయాంలో దళితులకు, గిరిజనులకు ఇచ్చిన భూముల ను కేసీఆర్ దొంగలా లాక్కుంటున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఇప్పటికే మూడు లక్షల ఎకరాలను గుంజుకున్నాడని తెలిపారు.  మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ దళిత గిరిజనులకు ఇచ్చిన భూములకు పట్టాలిస్తామని స్పష్టం చేశారు. త్వరలో గజ్వేల్ లో నిర్వహించే సభకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అసైన్డ్ భూములు కబ్జా చేశారని ఈటల రాజేందర్ ను  కేసీఆర్ భర్తరఫ్ చేశారని.. మరి ఇప్పుడు ఎందుకు ఆయనపై విచారణ చేయడం లేదో చెప్పాలన్నారు. టీఆరెస్,బీజేపీ,ఎంఐఎం ఒక్కటేనన్న అద్దంకి..కాంగ్రెస్ ఒక్కటి అన్నారు.