పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే ఇంటిపై దాడికి నిరసనగా సోమవారం పరకాల బంద్‌కు టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
అటు బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. గాయపడిన కార్యకర్తలను సోమవారం రాజాసింగ్ పరామర్శించనున్నారు. ఆయన ఈరోజు హన్మకొండ వెళ్లనున్నారు. బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ బీజేపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది.
ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి వివాదాస్పద కామెంట్లు చేశారు. బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేస్తూ.. డబ్బులు వసూలు చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. అదేవిధంగా ఒక కులాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక్కసారిగా హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపైఒకరు దాడిచేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడంతో.. టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక బీజేపీ కార్యాలయానికి నిప్పటించారు.
For More News..
‘ద వైట్ టైగర్’ మన తెలుగోడే
పిల్లల్ని అరవై శాతం ప్రేమిస్తే చాలంటున్న సీనియర్ హీరోయిన్
మమత హ్యాట్రిక్ సీఎం కావడం కష్టమే!