ఇయ్యాళ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లనున్న టీఆర్ఎస్ అభ్యర్థి

మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంత్రులు, కార్యకర్తలతో పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమం జన సమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామితో కలిసి.. మునుగోడు మండలంలో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చౌటుప్పల్, నారాయణపురంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ఎన్నికలు, భారత్ జోడో యాత్రపై గాంధీభవన్ లో సమావేశం కానున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంతో మునుగోడు బిజీగా మారింది.