మునుగోడు బైపోల్ ఐదో రౌండ్ ఫలితం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రతి రౌండ్‭లోనూ టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. మరోవైపు.. కూసుకుంట్లకు మునుగోడు ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఉపఎన్నిక కౌంటింగ్‭లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంతూరులో ఓటర్లు ఆయనకు షాకిచ్చారు. నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామంలో కూసుకుంట్ల కంటే రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నామమాత్రపు ప్రభావం చూపుతున్నారు. 

ఐదో రౌండ్

ఐదో రౌండ్‭లో సంస్థాన్ నారాయణపూర్‭లో ఓట్లను లెక్కించారు. ఐదు రౌండ్లు అయ్యేసరికి 1,531 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఐదు రౌండ్లు పూర్తయ్యాక టీఆర్ఎస్‭కు 32,505 ఓట్లు రాగా, బీజేపీకి 30,974 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్‭కు 10వేల 63 ఓట్లు వచ్చాయి.